గుంటూరు జిల్లా ఆత్మకూరు ఘటనపై పోలీస్ శాఖ అంతర్గత విచారణ చేపట్టనుంది. దీని కోసం కమిటీని నియమించగా... ఐఏఎస్‌లతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు నివేదిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆత్మకూరు వివాదానికి మూలాలు, వివాదం ముదరడానికి కారణాలేమిటి..?, తెలుగుదేశం పార్టీ బాధితుల శిబిరం నిర్వహణ, అనంతరం జరిగిన పరిణామాలపై వాస్తవాలను ఈ కమిటీ పరిశీలించనుంది. విచారణ ఆధారంగా పోలీసు శాఖ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజాగా ఆత్మకూరులో పరిస్థితిని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు కొన్నిప్రాంతాల్లో నిషేదాజ్ఞలు అమలు చేయనున్నారు.
ఇదీ చూడండి: