ETV Bharat / state

CRIME: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - గుంటూరు జిల్లా వార్తలు

CRIME: గుంటూరు జిల్లా నగరం మండలం కాసానివారిపాలెంలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను బాపట్ల డీఎస్పీ వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
author img

By

Published : Feb 18, 2022, 1:43 AM IST

CRIME: ఈ నెల 8 వ తేదీన గుంటూరు జిల్లా నగరం మండలం కాసాని వారిపాలెం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే... కర్రి ఆదిలక్ష్మి (30)అనే మహిళ పథకం ప్రకారం హత మార్చినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదిలక్ష్మికి బాపట్ల మండలం మూలపాలెం గ్రామానికి చెందిన బెజ్జం రాజేష్ (27) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇది తెలుసుకున్న భర్త కర్రి వెంకటేశ్వరరావు బంధువుల సమక్షంలో మందలించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆమె..తన భర్తను చంపేందుకు పథకం రచించింది. కృష్ణా జిల్లా నుంచి కొంగల మందు తీసుకొచ్చి 8 వ తేదీ రాత్రి కూరలో కలిపి భోజనం పెట్టగా...భర్త చనిపోయాడు.

మృతదేహాన్ని రెండవ రోజు... ప్రియుడితో కలిసి ఆదిలక్ష్మీ ఇంటి ఆవరణలోని పశువుల పాకలో పూడ్చి పెట్టారు. అయితే కుమారుడు కనిపించకపోవటంతో మృతుడి తండ్రి...ఆదిలక్ష్మీని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగిందని గట్టిగా నెట్టడంతో గోడకు తగిలి చనిపోయాడని ఆమె తెలిపింది. భయంతో ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టినట్లు చెప్పడంతో మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని తీయించి.. పంచనామా చేశారు. పథకం ప్రకారమే జరిగిన హత్యగా గుర్తించారు. వివాహేతర సంబంధం వలనే హత్య చేశారని ...ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

హిజాబ్​పై కర్ణాటక సర్కార్​ మరో కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.