గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సమీపంలోని కృష్ణానది బ్రిడ్జిపై కారులో తరలిస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా సుమారుగా 150 కేజీల గంజాయిని గుర్తించారు.
కారులో ఉన్న వస్తువులను పరిశీలిస్తున్న సమయంలో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం