ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్(hyderabad) నుంచి రాజధాని అమరావతి(amaravati)కి వచ్చారు. ఈ విషయం తెలిసి.. కౌలు చెక్కులు త్వరగా ఇవ్వాలని కోరేందుకు రైతులు, ఎస్సీ ఐకాస నాయకులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వినతిపత్రం తీసుకోకుండా ఎమ్మెల్యే శ్రీదేవి వెళ్లిపోయారు. దీంతో రైతులు, ఐకాస నేతలు నిరసన తెలిపారు. రెండు చోట్ల ఎస్సీ ఐకాస నాయకుల అడ్డగించేందుకు యత్నించగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వెంకటపాలెం చెక్‌పోస్టు వద్ద ఐకాస నాయకులు చిన్నా, శిరీషని అరెస్టు చేశారు. మల్కాపురం జంక్షన్ వద్ద కాంగ్రెస్, ఎస్సీ ఐకాస నేతల నిరసన తెలిపారు. నిరసన తెలిపిన పీసీసీ ప్రధాన కార్యదర్శి విజయ్, ఐకాస నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమకు నిరసన తెలిపే హక్కు ఉందని.. పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారని ఎస్సీ ఐకాస నేతలు ఆరోపించారు. ఎస్సీ శాసనసభ్యురాలైన శ్రీదేవి ఎస్సీ రైతులను అరెస్ట్ చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్