ETV Bharat / state

డ్రైవర్‌ సుబ్రహ్మణం హత్య కేసును నీరుగార్చుతున్నారు.. తల్లిదండ్రుల ఆవేదన - డ్రైవర్‌ సుబ్రహ్మణం హత్య కేసు తాజా వార్తలు

Driver Subramanyam case: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన తల్లిదండ్రులు వాపోయారు. తెదేపా అధినేత చంద్రబాబును పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసిన వారు.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. హత్య కేసు విషయంలో ఇప్పటికీ వైకాపా వర్గాలు, ఇతర వ్యక్తుల నుంచి తమకు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.

Driver Subramanyam case
చంద్రబాబు ఎదుట డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఆవేదన
author img

By

Published : Jun 25, 2022, 7:05 AM IST

Driver Subramanyam case: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణలు చంద్రబాబు ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వారు ఆయనను శుక్రవారం కలిశారు. హత్య కేసు విషయంలో ఇప్పటికీ వైకాపా వర్గాలు, ఇతర వ్యక్తుల నుంచి తమపై ఒత్తిళ్లు ఉన్నాయన్నారు.

హత్య కేసు నుంచి వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును బయటపడేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. తమ కుమారుడి హత్య కేసులో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మద్దతుగా నిలవాలని వారు చంద్రబాబును కోరారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. తెదేపా తరఫున రూ.5 లక్షలు సాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామని వారికి చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.