గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులోని అంకమ్మ, పోలేరమ్మ తల్లుల తిరునాళ్ళు వైభంగా జరుగుతున్నాయి. అమ్మవార్లకు 108 బిందెల పసుపు నీళ్ల అభిషేకం చేశారు. అమ్మవార్లకు ముప్పవరపు వరప్రసాద్, విజయలక్ష్మి దంపతులు మల్లెపూలను సమర్పించారు. అనంతరం మల్లెపూలతో అంకమ్మ, పోలేరమ్మలకు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవార్ల దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
ఇవీ చూడండి : చలివేంద్రానికి దాహం... అది మంత్రిగారి నియోజకవర్గం