ప్రభుత్వాలు మారినప్పుడల్లా లబ్ధిదారులను మార్చడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల లబ్ధిదారులు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. గత తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం ఇళ్లు మంజూరు చేయించాలని కన్నాకు వారు విజ్ఞప్తి చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారీతిన లబ్ధిదారులను మారుస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని కన్నా లక్ష్మీనారాయణ వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: