మేడారం జాతరలో భాగంగా.. తెలంగాణ ములుగు జిల్లా గట్టమ్మ ఆలయ పరిసరాల్లో 20 అడుగుల ప్లాస్టిక్ కాలకేయ బొమ్మను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. మానవాళి మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్‌ను జిల్లా నుంచి పారద్రోలేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని కలెక్టర్ అన్నారు. జాతరకొచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని... దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జాతర ప్లాస్టిక్ రహితంగా జరిగేలా అందరూ సహకరించాలంటున్న కలెక్టర్ నారాయణరెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి...
ఇవీచూడండి