జేఎన్టీయూ నూతన కళాశాల నిర్మాణ ప్రాంగణం వద్ద వన మహోత్సవంలో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కళాశాల ప్రాంగణం వద్ద మొక్కలు నాటారు. సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కళాశాల నిర్మాణానికి ఎటువంటి అవసరం వచ్చినా తానున్నానని తెలిపారు. గత ఆరు సంవత్సరాల క్రితమే 85 ఎకరాల ప్రభుత్వ భూమిలో జేఎన్టీయూ ముంజూరైనా కళాశాల నిర్మాణానికి నోచుకోలేక పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అటువంటి సమస్య కలగకుండా తోడ్పాటు అందిస్తుందని,అవసరమైతే కళాశాల నిర్మాణానికి, ల్యాబ్‌లకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. 13వందల మంది విద్యార్థులు ఉన్న కళాశాలకు సొంత భవనం లేక ప్రతి విద్యార్థి ఇప్పటి వరకూ ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలా జరగకుండా ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగవంతంచేసి సమస్యకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ఇదీ చూడండి:నేడు రాజధానిలో పర్యటించనున్న భాజపా నేతలు
జేఎన్టీయూ విద్యార్థులకు సౌకర్యాలందిస్తాం.. - plantation programme at jntu
జేఎన్టీయూ నూతన కళాశాల నిర్మాణ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.