ETV Bharat / state

ముఖ్యమంత్రిని ప్రతివాదుల జాబితాలో చేర్చలేము : హైకోర్టు - reservation to Kapu

Kapu Reservation : కాపులకు రిజర్వేషన్​ కల్పించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై వాదపోవాదనలు జరిగాయి. దీనిలో గత ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్​ కోసం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయాలని పిటిషనర్​ హైకోర్టును కోరారు.

High Court
హైకోర్టు
author img

By

Published : Feb 7, 2023, 8:56 AM IST

High Court On Kapu reservation : కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు కేటాయిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రిని ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలుపుతూ నంబరు కేటాయించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. రఘునందన్‌రావు విచారణ జరిపారు.

కాపులకు రిజర్వేషన్‌ కల్పించే వ్యవహారాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని పిటీషనర్ న్యాయవాది రాధాకృష్ణ వాదనలు వినిపించారు. ప్రస్తుతం మాత్రం వైసీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ జీవో తీసుకొచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నామని తెలపగా.. మ్యానిఫెస్టో అంశాల అమలుకు న్యాయస్థానాలు ఆదేశించలేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. దాంతో సీఎం పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఆ వివరణను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. మంగళవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.