ETV Bharat / state

phone number: నా ఫోన్ నంబర్​ నాకు ఇస్తారా? చావమంటారా?!

ఓ యువకుడు తన సెల్​ఫోన్ నంబర్ తనకు కావాలంటూ.. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్ నంబర్ కోసం కిరోసిన్ పోసుకుని చనిపోయేంత పని చేశాడు. మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇపిస్తామనే దాకా.. గొడవపడుతూనే ఉన్నాడు.

person suicide attempt for phone number in gunturu

author img

By

Published : Jul 7, 2021, 9:46 AM IST

సెల్‌ ఫోన్‌ నంబర్‌ కోసం ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. బృందావన్‌గార్డెన్స్‌కు చెందిన యువకుడు ఓ కంపెనీకి చెందిన సిమ్‌ కార్డు తీసుకొని ఉపయోగిస్తున్నాడు. కొంతకాలం బిల్లు చెల్లించకపోవడంతో సదరు కంపెనీ వాళ్లు ఆ నంబర్‌ను డీఫాల్ట్‌ చేశారు. కొత్తగా నంబర్లు జారీ చేసే క్రమంలో జిల్లాపరిషత్‌ కార్యాలయానికి(జడ్పీ) దానిని కేటాయించారు. తన సెల్‌ఫోన్‌ నంబర్‌ పనిచేయకపోవడంతో సదరు యువకుడు విచారించి విషయం తెలుసుకున్నాడు.

జడ్పీ కార్యాలయానికి వచ్చి.. తన నంబర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ వాదనకు దిగాడు. అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులు కార్యాలయం కోసం కొత్తగా సిమ్‌కార్డు తీసుకున్నారని, అలా ఆ సెల్‌ కంపెనీ వాళ్లు ఇచ్చారని తెలిపారు. అయినా అతను వినకుండా తన నంబర్‌ ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, తనతో డబ్బాలో తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకున్నాడు. ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన జడ్పీ సిబ్బంది నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రత్నస్వామి తమ సిబ్బందితో జడ్పీకి చేరుకొని ఆ యువకుడి చేతిలోని కిరోసిన్‌ డబ్బాను లాక్కొన్నారు. అతన్ని సముదాయించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఏం జరిగిందని వివరాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో తన నంబర్‌ ఇప్పించాలంటూ అతడు పోలీసులపై ఒత్తిడి చేయడంతో తాను కంపెనీ వాళ్లకు చెప్పి మంచి ఫ్యాన్సీ నంబర్‌ ఇప్పిస్తానని సీఐ బుజ్జగించి పంపించారు.

ఇదీ చదవండి: విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.