ETV Bharat / state

అప్పు చేసిన వ్యక్తి అదృశ్యం.. పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు - సత్తెనపల్లిలో వ్యక్తి అదృశ్యం వార్తలు

వ్యాపారం కోసమని అప్పు తీసుకున్నాడు... లాభాలు వచ్చాక తిరిగిస్తానని చెప్పాడు.. అంతలోనే కనిపించకుండా పోయాడు. దీనితో అప్పిచ్చిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

person missing in sattenapalli
అదృశ్యమైన వ్యక్తి
author img

By

Published : Oct 3, 2020, 12:49 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. మండలంలోని చాగంటివారిపాలెంకు చెందిన పుల్లా సాహెబ్ ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన సీతారామయ్య అనే వ్యాపారి వద్ద రూ. 7 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. పరికరాలు తెచ్చి ఇక్కడ సరఫరా చేశాక లాభాల్లో వాటా ఇస్తానన్నాడు. విశాఖ వెళ్తున్నట్లు చెప్పాడు.

అయితే ఈనెల 28న వెళ్లిన పుల్లా సాహెబ్ ఇప్పటి వరకూ రాలేదని.. అతని ఫోన్ పని చేయటం లేదని సీతారామయ్య సత్తెనపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అలాగే పుల్లా సాహెబ్ తల్లిదండ్రులూ తమ కుమారుడు 4 రోజులుగా కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. సీతారామయ్యతో పాటు మరికొందరి వద్ద కూడా పుల్లా సాహెబ్ డబ్బు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ. 12కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇపుడు అతని అదృశ్యం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

నోటీసు ఇవ్వకుండా సబ్బం హరి ఇల్లు కూల్చేందుకు కుట్ర: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.