ETV Bharat / state

'న్యాయం కోసం వెళ్తే  సీఐ వేధిస్తున్నాడు'

న్యాయం చేయమని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కి వెళితే... సీఐ కళ్యాణ రాజు తనను వేధిస్తున్నాడని ఉపేంద్ర అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి రాసివ్వాలని తన కూతురు-అల్లుడు తనను వేధిస్తున్నారని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయిస్తే ప్రతిగా తననే చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు ఆరోపించారు.

person complaint to sp on ci in gunturu
person complaint to sp on ci in gunturu
author img

By

Published : Jul 27, 2020, 11:23 PM IST

తనకు న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఉపేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన ఉపేంద్రకు కుమార్తె ఉంది. ఆమెకు కొంతకాలం క్రితం పెళ్లి అయ్యింది. అయితే ఇప్పుడు కూతురు-అల్లుడు కలిసి తమకు ఆస్తి రాసివ్వాలని ఉపేంద్రపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఉపేంద్ర పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అతని వాదనను పట్టించుకోకపోగా అతడి కుమార్తె-అల్లుడికి మద్దతుగా నిలిచారు. లంచం ఇవ్వకపోవడంతో సీఐ తన అల్లుడికి వత్తాసు పలుకుతున్నాడని బాధితుడు ఉపేంద్ర ఆరోపిస్తున్నాడు. సీఐ కళ్యాణ రాజు తన అల్లుడి వద్ద లక్ష రూపాయల నగదు లంచం తీసుకుని తనను చిత్రహింసలు పెట్టాడని చెబుతున్నాడు. సీఐ ప్రోద్బలంతో తనను తీవ్రంగా కొట్టి దాడి చేశారని వాపోయాడు. ఆస్తి రాసివ్వకపోతే...అంతు చూస్తానని సీఐ బెదిరిస్తున్నాడని ఉపేంద్ర తెలిపాడు. తనకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.