ETV Bharat / state

కారంపూడి వీరుల గుడిని సందర్శించిన గద్దర్, సినీ నిర్మాత సత్యారెడ్డి - Ukku satyagraha latest News

దర్శక నిర్మాత, తెలుగు సేన జాతీయ అధ్యక్షుడు పి. సత్యారెడ్డి రూపొందిస్తున్న "ఉక్కు సత్యాగ్రహం" సినిమాకు ప్రముఖ ప్రజా గాయకులు, రచయిత గద్దర్ పాటలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని మాచర్లలో నిర్మాతతో కలిసి పర్యటించారు. అనంతరం కారంపూడి వీరుల దేవాలయాన్ని సందర్శించారు.

కారంపూడి వీరుల గుడిని సందర్శించిన గద్దర్, సినీ నిర్మాత సత్యారెడ్డి

author img

By

Published : Apr 2, 2021, 3:47 AM IST

గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ప్రముఖ ప్రజా గాయకులు రచయిత గద్దర్ పర్యటించారు. పల్నాటి యుద్ధం జరిగిన ప్రాంతం పరిధిలోని కారంపూడి వీరుల దేవాలయాన్ని తెలుగు సేన జాతీయ అధ్యక్షుడు పి.సత్యారెడ్డితో కలిసి సందర్శించారు. సత్యారెడ్డి దర్శక, నిర్మాతగా తెరకెక్కుతోన్న "ఉక్కు సత్యాగ్రహం" సినిమాలో గద్దర్ పాటలు రాస్తున్నారు. మరో పాటలో నటిస్తున్నారు.

పౌరుషాల పురిటిగడ్డ స్మరణ..

ఈ సందర్భంగా పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు చరిత్రను గద్దర్ గుర్తు చేసుకున్నారు. పల్నాడు సంస్కృతి సహా చరిత్ర తనను బాగా ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు చరిత్రపై కొన్ని ప్రత్యేక గీతాలు రచిస్తూ, వీర కన్నమదాసు చరిత్రను లోతుగా పరిశోధిస్తున్నట్లు వివరించారు. కన్నమదాసు ఖడ్గం చేతబూనిన గద్దర్.. అనంతరం ఆ మహావీరుడ్ని స్మరించుకున్నారు.

'ఆయన నటించడం మా అదృష్టం'

అతి త్వరలో పల్నాడు సాంఘిక, సాంస్కృతిక చరిత్రపై అద్భుతమైన సినిమా రూపొందిస్తానని సత్యారెడ్డి తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే అంశం మీద "ఉక్కు సత్యాగ్రహం" నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలో గద్దర్ పాటలు రచించి, స్వయంగా నటించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అందుకు గర్వపడుతున్నా..

"ఉక్కు సత్యాగ్రహం" సినిమాతో పాటు భవిష్యత్తులో తాను పల్నాడు కథాంశంతో నిర్మించబోయే సినిమాలకు మాచర్లకు చెందిన వేముల శ్రీనివాసరావు కథా సహకారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలిపారు. తాను కూడా పల్నాడు ప్రాంతంలో జన్మించినందుకు గర్వపడుతున్నానని సత్యారెడ్డి వివరించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి తన సహకారం ఉంటుందని వివరించారు.

ఇవీ చూడండి : ఉపపోరు: సమీపిస్తున్న పోలింగ్.. ప్రచారానికి పదును..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.