నివాస యోగ్యం కాని స్థలాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అలాగే బీసీ నాయకుల విగ్రహాలు లేకుండా చేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త పడేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. బీసీలను చిన్నచూపు చూస్తూ కులం బురదలో వైకాపా నేతలంతా కొట్టుమిట్టాడుతున్నారని అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి
ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ప్రారంభించనున్న సీఎం జగన్