ETV Bharat / state

కొన్ని ప్రాంతాలకే నిత్యావసరాలు.. ప్రజల ఇబ్బందులు - lockdown

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గుంటూరు జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రాంతాలను రెడ్​ జోన్లుగా ప్రకటించి.. ఆ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి వారికి నిత్యావసరాలు ఇంటికే అందించేలా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సరకులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

people problems in guntur redzone area
గుంటూరు రెడ్​జోన్​ ప్రాంతాలలో నిత్యావసరాలు అందక స్థానికుల అవస్థలు
author img

By

Published : Apr 17, 2020, 8:10 AM IST

గుంటూరు నగరంలోని రెడ్​జోన్లుగా ప్రకటించిన కొన్ని ప్రాంతాల్లో నిత్యావసరాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సంచార విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోతోంది. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా నగరంలో 10 చోట్ల కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేశారు. రెడ్​జోన్లలో ఉండే వారికి నిత్యావసర వస్తువులు అందజేసే బాధ్యతను వీరికి అప్పగించారు. అయితే కొన్ని వీధుల్లో ఉన్న వారికే సరుకులు, కూరగాయలు అందుతున్నాయని.. తమకు అందడం లేదని కొందరు కాలనీ వాసులు వాపోయారు. కొన్ని చోట్ల వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి...

హైడ్రాక్సీ క్లోరోక్విన్​ వాడితే ఇన్ని సమస్యలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.