ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి నిధులు విడుదల చేసినా... రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని ఆరోపించారు. ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వడంలో జగన్ సర్కారు విఫలమైందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు.
ఇదీ చదవండి