కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పింఛన్లు పంపిణీ చేపట్టింది. వాలంటీర్లు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో పింఛన్లు చాలా వరకు పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వేలిముద్రలకు బదులు ఫోటో తీసి నగదును అందిస్తున్నారు. అయితే కొంతమంది వార్డు వాలంటీర్లు ముఖానికి మాస్కులు ధరించకుండా నగదు పంపిణిీ చేయటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి