రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయని... తెదేపా నేత బోండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు కొట్టిపారేశారు. తన స్వగ్రామం తుళ్లూరు మండలం పెదపరిమిలో పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి ఉందని... అదే విషయం ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని వివరణ ఇచ్చారు. 2014 తర్వాత తాను రాజధాని ప్రాంతంలో ఎక్కడా భూమి కొనలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తాను స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నానని... గుంటూరు జిల్లాలో చేయటం లేదని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి తమపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు తెదేపా నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని తెదేపా నాయకులకు సూచించారు.
ఇదీచూడండి.రాష్ట్ర ప్రభుత్వానికి బొండా ఉమా సవాల్