గుంటూరు జిల్లాలోనే పేరుగాంచిన పెదకాకాని మల్లేశ్వర ఆలయం 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ శ్యామల రఘునాథ్ రెడ్డి తెలిపారు. మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికమవడంతో… ఇప్పటికే ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం స్వామి వార్ల దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చే నెల 10వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేసినా.. స్వామికి అర్చక స్వాములచే ఏకాంత సేవలు నిర్వహించబడతాయని శ్యామల రఘునాథ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి
దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు 'ఈటీవీ బాలభారత్' అంకితం: రామోజీరావు