ETV Bharat / state

'అప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు..?'

నవరత్నాల ప్రకటన విడుదల చేసినప్పుడు... కేంద్ర ప్రభుత్వ సాయంతో రైతుభరోసా పథకాన్ని రూపొందిస్తామని జగన్ ఎందుకు చెప్పలేదని... జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైతు భరోసా నగదు 3 విడతల్లో కాకుండా రబీ, ఖరీఫ్ సమయాల్లో 2 విడతలుగా అందించాలని జనసేన కోరుతున్నట్లు తెలిపారు.

పవన్ కల్యాణ్
author img

By

Published : Oct 16, 2019, 2:37 AM IST

Updated : Oct 16, 2019, 3:00 AM IST

రైతు భరోసాను కేంద్ర పథకమైన కిసాన్ యోజనతో ముడిపెట్టి... అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని భావిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా రూ.12వేల 500 అందిస్తామని నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలోనూ ప్రకటించిన విషయం గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ యోజన పథకంలోని రూ.6వేలతో కలిపి రూ. 13వేల 500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

నవరత్నాల ప్రకటన విడుదల చేసినప్పుడు... కేంద్ర ప్రభుత్వ సాయంతో రైతుభరోసా పథకాన్ని రూపొందిస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు . రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12వేల 500, కేంద్రం సాయం రూ.6వేలు కలిపి మొత్తం రూ.18వేల 500 ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోందన్నారు. ఒకవేళ అంత మొత్తాన్ని ఇవ్వలేకపోతే అందుకు కారణాలను రైతులకు చెప్పాలని... వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలన్నారు.

అధికారంలోకి వచ్చిన పార్టీ తమ ఎన్నికల ప్రణాళికను తప్పక అమలుచేయాలన్నది సహజ న్యాయ సూత్రమన్నారు. లబ్ధిదారుల ఎంపికలోనూ గందరగోళం నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హులైనవారు సుమారు 86 లక్షల మంది ఉండగా... 40 లక్షల మంది రైతులకే పరిమితం చేయడం అన్యాయమన్నారు. కౌలు రైతుల ఎంపికలో నిబంధనలను సవరించాలన్నారు. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకం అందేలా చూడాలని కోరారు. 3 విడతల్లో కాకుండా రబీ, ఖరీఫ్ సమయాల్లో 2 విడతలుగా అందించాలని జనసేన కోరుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ... 'వైకాపా ప్రభుత్వం... వాయిదాల ప్రభుత్వం'

sample description
Last Updated : Oct 16, 2019, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.