ETV Bharat / state

పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం చేయండి: పవన్ కల్యాణ్ - జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు

Janasena Membership: ఈనెల 10వ తేదీన ప్రారంభం కానున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గత రెండు విడతలలో సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన 6వేల 400 మంది వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Pawan Kalyan
పవన్ కల్యాణ్
author img

By

Published : Feb 3, 2023, 6:06 PM IST

Janasena Membership: ఈనెల 10వ తేదీన ప్రారంభం కానున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధినేత పవన్ కల్యాణ్ కోరారు. గత రెండు విడతలలో సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన 6,400 మంది వాలంటీర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే ఉత్సాహంతో ఈ నెల 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు జరిగే మూడో విడత సభ్యత్వ నమోదుని కూడా జయప్రదం చేయాలన్నారు. పార్టీ సభ్యుల ప్రమాద బీమా నిమిత్తం పవన్ కల్యాణ్ గతంలో రూ.2కోట్లు విరాళమిచ్చారు. ఈసారి కూడా తన విరాళాన్ని 10వ తేదీన ప్రకటిస్తానన్నారు.

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గురించి వివరిస్తున్న పవన్ కల్యాణ్

"జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుకానుంది. 2021,2022 సభ్యత్వ నమోదు చాలా విజయవంతంగా కొనసాగింది. 2023లో సభ్యత్వ నమోదు కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని జనసేన నాయకులను, వీరమహిళలను, జనసైనికులను ప్రత్యేకంగా కోరుతున్నాను. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ వాలంటీర్ల పాత్ర మరువలేనిది. 6,400 పైచిలుకు వాలంటీర్లు అమోఘమైన కృషి చేశారు. వారందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను". - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.