ETV Bharat / state

ప్రభుత్వ విధానం నిరంకుశ పోకడలను తెలియచేస్తోంది: పవన్​కల్యాణ్​

Pawan Kalyan: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్ ఎద్దేవా చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
Pawan Kalyan
author img

By

Published : Feb 17, 2023, 11:04 PM IST

Pawan Kalyan on Chandrababu: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు? ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్ అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్ధం తెలియదని పవన్ కల్యాణ్​ అన్నారు. వైసీపీ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదని విమర్శించారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని పవన్ వెల్లడించారు. మెుదట సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తరువాత.. ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై నేతల ఒత్తిడి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని పవన్ వెల్లడించారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పవన్ విమర్శించారు.

జనవాణి కార్యక్రమం కోసం తాను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏలా బంధించారో ప్రజలు చూశారని పవన్ పేర్కొన్నారు. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి అనంతరం.. బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నా విషయాన్ని గుర్తుచేశారు. నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలు పెట్టారని వెల్లడిచారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందంటూ పవన్ ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని అర్థమవుతుందటూ పవన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని వైసీపీ పాలకులు తెలుసుకోవాలని నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.