ETV Bharat / state

కలిస్తే గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్ కల్యాణ్ - పొత్తులపై పవన్ తాజా వార్తలు

*‘వచ్చే ఎన్నికల్లో గెలుపు ఐక్యతపై ఆధారపడి ఉంటుంది. 2014లో నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను. తగ్గడం వల్ల మనం పెరుగుతాం. సీఎం జగన్‌ ఎంతవరకు పాటిస్తారో తెలియదు కానీ.. బైబిల్‌లోని ఒక సూక్తి నేను పాటిస్తాను. ‘తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును’ అనే దాన్ని పాటిస్తాను.’ *‘జగన్‌ మిగతా వాళ్లను తగ్గించి ఆయన పెరుగుతున్నారు. మిగతా వాళ్ల దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. నాది అలాంటి వ్యక్తిత్వం కాదు. నేను రాష్ట్రం ప్రయోజనాల కోసం తగ్గుతాను. అన్నిసార్లూ తగ్గుతాను అని చెప్పను. తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో ఒకసారి, 2019లో ఒక ప్రకటన ఇచ్చేందుకు తగ్గాను. 2024లో తగ్గడానికి సిద్ధంగా లేం. అన్నిసార్లు తగ్గాం. ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుందని నా కోరిక.’ - పవన్‌ కల్యాణ్‌

పొత్తులపై పవన్ క్లారిటీ
పొత్తులపై పవన్ క్లారిటీ
author img

By

Published : Jun 4, 2022, 8:11 PM IST

Updated : Jun 5, 2022, 5:22 AM IST

కలిస్తే గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో జనసేన ముందు ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయని ప్రకటించారు. ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు లేదా భాజపాతో కలిసి వెళ్లడం.. లేదంటే తెదేపా, భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అని ప్రకటించారు.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. తెదేపా నాయకులకు ఒక్కటే చెబుతున్నా. ‘తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును’ అనే బైబిల్‌ సూత్రాన్ని పాటించాలి. ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. తెదేపా అధినేత చంద్రబాబు ‘వార్‌ వన్‌సైడ్‌ అయింది’ అంటున్నారు.

గతంలో వన్‌సైడ్‌ లవ్‌, ఇప్పుడు వార్‌ వన్‌సైడ్‌ అంటున్నారు. తెదేపా వారు ఏ మాటపై నిలబడతారో చూసి ఆ తర్వాత మాట్లాడదాం. తగ్గాల్సినంత కాలం తగ్గాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాం. ఆ దిశగా వెళ్తే పొత్తులను ఆహ్వానిద్దాం. పొత్తుల విషయం ఒక్క జనసేన చేతుల్లోనే లేదు. మిగతా వారి చేతుల్లోనూ ఉంది. కొత్తతరం కోసం నిలబడాలని అనుకుంటున్నాం. ఏదో 25 కేజీల బియ్యం కాదు.. యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలి. భాజపా నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని నాతో ఎవ్వరూ చెప్పలేదు. జాతీయ నాయకులు చెబితే చెబుతాను. పేపర్లలో వచ్చే వాటి ఆధారంగా చెప్పలేను.

భాజపాతో భౌతికదూరం వచ్చింది..
‘‘కరోనా కారణంగా భాజపా, జనసేన మధ్య భౌతికదూరం వచ్చింది. కరోనా తగ్గిపోతే అదీ తగ్గిపోతుంది. వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల భాజపా జాతీయ అధ్యక్షుడు పర్యటనకు హాజరు కాలేకపోతున్నాను. జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడాను. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, అప్పులు, పోలవరం, గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందుల గురించి చెప్పాను. రైతులు దోపిడీకి గురవుతున్నారు. వైకాపా రైతులను విస్మరించింది. కోనసీమలో కులాల మధ్య ఘర్షణను నివారించేలా శాంతి కమిటీలు వేస్తాం. శాంతి ప్రయత్నం చేస్తాం. అంబేడ్కర్‌ గొప్పదనం తెలియచేయాలి. ఆడబిడ్డలను కించపరిచే విమర్శలు నిలిపివేయాలని అందరికీ చెప్పాలి.

.

పెట్టుబడికి రూ. 10 లక్షలు..
జనసేన అధికారంలోకి వస్తే.. అమరావతే రాజధానిగా ఉంటుంది. ఇసుకను అల్పదాయవర్గాలకు ఉచితంగా ఇస్తాం. ఏటా లక్ష మంది వ్యాపారవేత్తలను తయారు చేస్తాం. ఏడాదికి రూ.10 వేల కోట్లు సౌభాగ్య పథకం కింద ఖర్చు చేస్తాం. వ్యాపార పెట్టుబడికి రూ. 10 లక్షలు ఒక్కసారే ఇస్తాం. ఐదేళ్లల్లో 50 లక్షలమంది యువతకు ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. సీపీఎస్‌ రద్దు చేస్తాం. మీకు రూ.లక్షల కోట్లు దోపిడీ చేసే తెలితేటలు ఉన్నట్లే మాకు సీపీఎస్‌ రద్దు చేసేందుకు తెలితేటలున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. దావోస్‌కు వెళ్లి కోటులు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండి, పాలనలో స్థిరత్వం ఉంటే వస్తాయి. దావోస్‌ వరకు వెళ్లి అదానీ, అరవిందో ఒప్పందాలు చేసుకోవాలా? విజయవాడలో కూర్చొని చేసుకోవచ్చు కదా? దీనికి ప్రత్యేక విమానం ఖర్చులు, ఇతర వాటిని మనం మోయాలి.

కోనసీమలో వైకాపా కుల ఘర్షణలు
కోనసీమ అల్లర్లను కుల ఘర్షణలుగా చిత్రీకరించేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నించింది. భారతదేశం కులాలతో నిర్మితమైన దేశం. దేశ రాజకీయాలన్నీ కులాలతో ముడిపడి ఉన్నాయి. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసే సమయంలో గుణం ప్రధానంగా ఉండేది. కానీ, ఎన్నికలకు వచ్చేసరికి కుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కులాలను విభజించి పాలించాలన్నది వైకాపా నైజం. కులాల ఐక్యత జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతం. ఓట్ల వద్దకు వచ్చేసరికి కులాలకు ప్రభావితమవుతున్నారు. వైకాపా కోనసీమ అల్లర్లు సృష్టించడం చాలా బాధకరం. దీన్ని బహుజన సిద్ధాంతంపై దాడిగా జనసేన చూస్తోంది. కోనసీమలో అన్ని కులాల మధ్య ఐక్యత తీసుకురావాలని గతంలో చాలాసార్లు సమావేశాలు పెట్టాను. ఓట్లు వేస్తారా? లేదా? అనేది తర్వాత విషయం. ఏ ప్రాంతానికి వెళ్లినా గొడవలు ఉంటాయి. విజయవాడలో కమ్మ, కాపు మధ్య గతంలో జరిగిన ఘర్షణలతో అనేక విధ్వంసాలు జరిగాయి. తెలంగాణలో కులాల కంటే తెలంగాణకే ప్రాధాన్యం ఇస్తారు. ఆంధ్రలో కులాలకే ప్రాధాన్యం ఉంటుంది. దీనికి నాయకులే కారణం. వైకాపా నాయకుడు పెద్ద వయసున్న వ్యక్తి కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు నిర్మించాల్సిన వ్యక్తి కూడా కులాల విభజన సృష్టిస్తున్నారు.

అవినీతితో వచ్చి.. ఏసీబీని నియంత్రిస్తున్నారు..
అవినీతితో వచ్చిన సీఎం జగన్‌ ఈరోజు ఏసీబీని నియంత్రిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా యాప్‌ను ప్రారంభించారు. ఎక్కడ లంచాలు ఉన్నాయో చెప్పండి అంటే.. సీఎం జగన్‌ మొదట లంచం తిన్నారని చెప్పాల్సి ఉంటుంది. అవినీతితో దాడులు చేసే వారి పాలనలో మనం ఉన్నాం. దేశ పౌరుడిగా ఇది నాకు ఇబ్బందిగా ఉంది. వైకాపా నాయకత్వం డబ్బులు సంపాదించుకుంటోంది. జగన్‌ వాళ్ల నాన్న వైఎస్సార్‌ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత మద్యం నిషేధిస్తామని చెప్పి, వారే స్వయంగా అమ్ముతున్నారు. ఇసుక అక్రమాలను అరికడతామని ఒక కంపెనీకి ఇచ్చేశారు. కంపెనీ సోర్సు వెతికితే ఒకరికే లంచం వెళ్తుందని తెలుస్తుంది.

పకడ్బందీగా గొడవలు..
కోనసీమలో వైకాపా చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసి గొడవలు సృష్టించింది. రెండున్నర దశబ్దాలుగా అధికారం రాని వర్గాలు ఏకం కావాలని చూస్తుంటే దానిపై దాడి చేశారు. కుట్రపూరితంగా వైకాపా నాయకులు బీసీలపై శెట్టిబలిజలను తిట్టడం, దాడి చేయించడం చేశారు. బహుజన ఐక్యతపై దాడిగా దీన్ని చూస్తున్నాం. ఒక కులంపై రాజకీయం చేయకూడదు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వైకాపా ఉంది. పూర్తిగా కాపులందరూ జనసేనకు వేసి ఉంటే ఈరోజు జనసేనే అధికారంలో ఉండేది. కమ్మవారు ఓట్లు వేయకపోతే అమరావతిలో వైకాపా ఎలా గెలుస్తుంది? జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం వల్ల గొడవలు జరగలేదు. వైకాపాలోని రెండు వర్గాల మధ్య గొడవలను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ల మంత్రి విశ్వరూప్‌ను బాధ్యుడిని చేశారు. కేంద్ర నిఘావర్గాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ను ముందే హెచ్చరించాయి. ఇన్ని తెలిసి కూడా పట్టించుకోలేదు. యువకులకు ఉద్యోగాలు, శ్రామికులకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని పార్టీ వైకాపా.

కొన్ని కులాలను శత్రువుగా చూస్తోంది..
వైకాపా ఈరోజు కమ్మవారిని వర్గ శత్రువుగా ప్రకటించింది. ఒక మంత్రి, సీఎం జగన్‌ కమ్మ సామాజికవర్గాన్ని ద్వేషిస్తూ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? తిట్టాల్సినవన్నీ తిట్టేసి, జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే సరేనా? ఒంగోలులో వైశ్య కులానికి చెందిన వైకాపా కార్యకర్త గుప్తా మాట్లాడితే ఆయనపై దాడి చేశారు. ఆ కులాన్ని వైకాపా వర్గ శత్రువుగా చూస్తోంది. ఓట్లు వేయని ప్రతి కులాన్ని వర్గశత్రువుగా పరిగణించేయొచ్చు అనే సంస్కృతి తీసుకొచ్చింది. ఎంపీ రఘు రామకృష్ణరాజును తీసుకొచ్చి క్షత్రియ కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించారు. కోనసీమలో బీసీలు, మత్స్యకారులు, దేవాంగులు, శెట్టిబలిజలను శత్రువులుగా ప్రకటించింది. కాపులందరూ అందరూ మన వైపు ఉన్నారని వారిని శత్రువులుగా చూస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలను ఒక వైకాపా ఇక మర్చిపోవచ్చు. కోనసీమ తగలబడుతుంటే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి బొత్స మాట్లాడితే అర్థం కాదు. డబ్బుల గురించి మాట్లాడితే అర్థమవుతుంది. విమర్శలు వచ్చినప్పుడు ఆడ బిడ్డల ప్రస్తావన తీసుకురావద్దు’’ అని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

ఇవీ చూడండి

Last Updated : Jun 5, 2022, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.