గుంటూరు జిల్లాలో జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 862 ఎంపీటీసీ స్థానాలుండగా.. 226 ఏకగ్రీవమయ్యాయి. 65 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మిగతా 571 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 1418మంది పోటీ పడ్డారు. బరిలో నిలిచిన అభ్యర్థులు మరణించిన కారణంగా.. 7చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజధాని పరిధిలోని 58ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ఇక జిల్లాలో 57 జడ్పీటీసీ స్థానాలుండగా.. 8 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. శావల్యపురంలో అభ్యర్థి మరణించగా.. అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు.
గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు 571, జడ్పీటీసీలు 45
- వైకాపా 496, తెదేపా 57, జనసేన 10 ఎంపీటీసీల్లో గెలుపు
- ఎన్నికలు జరిగిన 45 జడ్పీటీసీల్లోనూ వైకాపా విజయం
ఇదీచదవండి: TDP: 'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచామని చెప్పటం సిగ్గుచేటు'