బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన కార్యాలయ అధికారులకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
కరోనా వైరస్ నివారణలో భాగంగా పారిశుద్ధ్య చర్యల కోసం గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా అయింది. అయితే అందులో నాణ్యత లేకపోవటంపై మీడియాలో కథనాలు వచ్చాయని... ఇలాంటి చర్యలకు సరి కాదని ఆయన అన్నారు.