ETV Bharat / state

గుంటూరులో పంచాయతీ ఎన్నికల సందడి.. రెండో విడతకు ముగిసిన ప్రచారం

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గుంటూరులో సందడి వాతావరణం నెలకొంది. తెనాలిలో తొలివిడత ఎన్నికలు ముగిశాయి. నరసరావుపేటలో రెండోవిడత ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగిసింది. నాలుగవ విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది.

Panchayat election victory celebrations
పంచాయతీ ఎన్నికల గెలుపు సంబరాలు
author img

By

Published : Feb 11, 2021, 10:08 PM IST

గుంటూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. తొలివిడత తెనాలి డివిజన్‌లో ఎన్నికలు ముగియడంతో అక్కడ గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే నరసరావుపేట డివిజన్‌లో గురువారంతో ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు రాత్రి పగలు తేడా లేకుండా ఓటర్లను కలుసుకుని గుర్తులు చెప్పి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మూడో విడత గురజాల డివిజన్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తయి అప్పీళ్ల పరిష్కారం కొనసాగుతోంది. నాలుగో విడత గుంటూరు డివిజన్‌లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార యంత్రాంగం దశలవారీగా నిర్వహిస్తున్న ఎన్నికలకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, సామగ్రి తరలింపు, విధుల కేటాయింపు తదితర అంశాలలో నిమగ్నమైంది. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం పంచాయతీ ఎన్నికల్లో నిమగ్నమైంది. ఊరూవాడా సందడిగా మారింది.

తీర ప్రాంతంలో ఫలితాలపై విశ్లేషణ

తెనాలి డివిజన్‌లో ఎన్నికలు పూర్తయి ఫలితాలు తేలడంతో రాజకీయ పార్టీలు వారి మద్దతుదారులకు వచ్చిన ఓట్ల లెక్కలు తీసుకుని విశ్లేషణలు చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో వచ్చిన ఓట్లు, ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తున్నారు. రాజకీయపార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగినప్పటికీ గ్రామాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీల మద్దతుతోనే బరిలోకి దిగారు. దీంతో ఎన్నికల ఫలితాలపై గ్రామస్థాయి నుంచి విశ్లేషణ మొదలైంది. ఎన్నికలు జరిగిన తీరు.. పోలింగ్‌ సరళి.. ఓటింగ్‌ శాతం తదితర అంశాలు పరిశీలించి ఒక అంచనాకు వస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. పరాజయం పొందిన అభ్యర్థులు లెక్కలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

నరసరావుపేటలో ప్రచార హోరు

రెండో విడతలో ఎన్నికలు జరిగే నరసరావుపేట డివిజన్‌ పరిధిలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని మండలాలతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారంతో ప్రచారం ముగిసింది. ఈనెల 13న పోలింగ్‌ జరగనుంది. ఈక్రమంలో అభ్యర్థులను ఓటర్లను కలుసుకుని విజయానికి బాటలు వేసుకుంటున్నారు.

గురజాల డివిజన్‌లో ఉత్కంఠ

గురజాల డివిజన్‌ పరిధిలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని మండలాల్లో 134 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాది జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అల్లర్లు జరగడం, ఎక్కువ ఏకగ్రీవం కావడంతో పంచాయతీ ఎన్నికలపై అందరూ దృష్టిసారించారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితులు నెలకొనడంతో పోటీ నామమాత్రంగా మారింది. మాచర్ల నియోజకవర్గంలో సింహభాగం పంచాయతీలు ఏకగ్రీవమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో పంచాయతీ పోరు పోటాపోటీగా సాగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ గొడవలు, దాడులు జరగడంతో రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇక్కడ ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనెల 17న ఇక్కడ పోలింగ్‌ నిర్వహిస్తారు.

గుంటూరులో మొదలైన పోరు

గుంటూరు డివిజన్‌లో నాలుగో విడతలో సత్తెనపల్లి, పెదకూరపాడు, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలో 266 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. గుంటూరు నగరం పరిసర నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో నగరవాసుల్లోనూ ఆసక్తి నెలకొంది. పరిసర నియోజకవర్గాల్లోని ప్రజలు గుంటూరు నగరంలో నివాసం ఉన్నప్పటికీ వారికి ఓటుహక్కు గ్రామాల్లోనే ఉంది. దీంతో నగరంలోనూ పంచాయతీ ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలంతా గుంటూరు నగరంలోనే ఉండటంతో వారి ఇళ్ల వద్ద హడావుడి నెలకొంది. నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఫిరంగిపురం, తాడికొండ, పెదకాకాని వంటి కీలకమైన పంచాయతీలు ఉండటంతో ఎన్నికలపై అందరూ దృష్టిసారించారు. ఈనెల 21న పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తారు. గుంటూరు డివిజన్‌లో ఎన్నికలు పూర్తయితే జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

ఇదీ చదవండి:

ఎన్నికల ఫలితాలు సీఎం పనితీరుకు నిదర్శనం: ఉమ్మారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.