సముద్ర ఉత్పత్తుల ద్వారా దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో 47 శాతం ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నట్లు మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి కొనియాడారు. వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధమైన, మత్స్య, పశుసంవర్థక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. విత్తన శుద్ధి, మొక్కల పెంపకం, ఆక్వా, మేలు జాతి పశువులని ఉత్పత్తి చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రతిష్ఠాత్మకమైన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
ఆక్వా రైతులకు 48 కేంద్రాలు
రైతు భరోసా కేంద్రాలతో పాటు ఆక్వా రైతులకు సలహాలు, భూ పరీక్షలు, నీటి పరీక్షలు చేసేలా రాష్ట్రంలో అనుకూల ప్రదేశాల్లో 48 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి సాంకేతిక పరికరాలతో టెక్నీషియన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంతో పాటు సంబంధిత అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: