గుంటూరు జిల్లాలోని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో దుకాణాలను ఆబ్కారీ శాఖ అధికారులు తెరిపించారు. దుకాణాల్లోని నిల్వలు పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మకాలు జరిపేందుకు అనుమతిచ్చారు.
దుకాణం వద్ద అయిదుగురికి మించి ఉండకూడదనే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ముఖానికి రూమాలు కట్టుకోవాలని, లేదంటే మాస్కులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: