రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు.. మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు వేధిస్తున్న తీరుపై ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో రూ.5 వేలు అప్పు తీసుకుంటే.. దాన్ని చెల్లించేందుకు ఇంకో రెండు యాప్స్‌లో అప్పు తీసుకునే పరిస్థితి కల్పిస్తున్నారని బాధితులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. కాల్‌మనీ కేటుగాళ్ల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు.
తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ.. మీ స్నేహతుడు దొంగ, మోసగాళ్లు అని మెసేజ్‌లు పెడుతున్నారని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
ఇదీ చదవండి: