సత్తెనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. మండలంలోని లక్కరాజుగార్లపాడు, కందులవారిపాలెంలలో వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు భద్రాతా ఏర్పాట్లు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. లక్కరాజుగార్లపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని గట్టిభద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో దాడులకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. కందులవారిపాలెం గ్రామంలో ఇప్పటికే దాడులకు పాల్పడిన 30 మందిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి..