కౌలు రైతులకు అండగా నిలబడేలా బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు చెప్పారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో సేంద్రీయ సాగు క్షేత్రాలను మంత్రులు కన్నబాబు, పెద్దిరెడ్డి, ఎంపీలు బాలశౌరి, శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి ఆయన పరిశీలించారు. నాబార్డు ద్వారా రాష్ట్ర రైతులకు అందుతున్న చేయూతపై గోవింద రాజులుతో మా ప్రతినిధి ముఖాముఖి.