గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో.. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఒక వ్యక్తి మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
ప్రమాదంలో వ్యక్తి శరీరం మొత్తం చిద్రమైంది. మృతుడు దాదాపు 60 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: