రాష్ట్రంలో రెండో అత్యధిక కేసులున్న గుంటూరు జిల్లాలో... చాలా రోజుల తర్వాత ఒకరోజులో ఒక కేసు మాత్రమే నమోదైంది. కొత్తగా వచ్చిన కేసు మాచర్ల మండలం కొప్పునూరులో నమోదైంది. మొత్తంగా బాధితులైన వారి సంఖ్య 374కు చేరగా... ఇప్పటిదాకా 8 మంది మృత్యువాత పడ్డారు. 164 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. నరసరావుపేటలో మొత్తం కేసుల సంఖ్య 163కు చేరింది.
జిల్లాలో కరోనా కేసులు, వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలు, చికిత్సకు సంబంధించి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. గుంటూరులో నేడు కేంద్ర బృందం పర్యటించున్న నేపథ్యంలో... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు నివేదికను వివరించనున్నారు.
రెడ్ జోన్లలో కాకుండా కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవడంపైనా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. లాక్‌డౌన్ అమలులో పొరపాట్లు, రెడ్ జోన్లలో విధులు నిర్వహించే వారి ద్వారా కొత్త కేసులు వస్తుండటంతో యంత్రాగం మరింత అప్రమత్తమయ్యింది.
ఇదీ చదవండి: మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత