గుంటూరు జిల్లా మేడికొండ్రు మండలం పేరేచర్లకు చెందిన విజయలక్ష్మి భర్త కొన్నాళ్ల క్రితం మరణించారు. అప్పటినుంచి ఆమె మానసికంగా బాధపడుతోంది. దీనికి అనారోగ్యం తోడైంది. గ్రామంలోనే కుమార్తె వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తానున్న గదిలో ఉరేసుకుని మృతి చెందింది. తెల్లవారాక ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో ఆమె కుమార్తె వెళ్లి చూడగా అప్పటికే మరణించింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..