కరోనా వైరస్ సోకి వృద్ధుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడులో జరిగింది. గ్రామానికి చెందిన వృద్ధుడు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ...జూన్ 23న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వృద్ధుడు బుధవారం రాత్రి మృతి చెందాడు,
దీంతో మేడికొండూరు మండలంలో కరోనా తొలి మరణం నమోదైంది. మృతుడి భార్య, కుమారుడికి కరోనా పరీక్షించగా...పాజిటివ్ అని తేలింది. వారికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.