ETV Bharat / state

ఆమె మృతికి పోలీసుల సంతాపం... పాడె మోసిన ఎస్సై... - old lady died in thadepalli-police conducted cremation

తాడేపల్లి పోలీసుల అభిమానాన్ని పొందిన వృద్ధురాలు మృతి చెందారు. 40 ఏళ్లుగా పోలీసుస్టేషన్‌లో సేవలందిస్తున్న వృద్ధురాలు బానావత్‌ మూగమ్మ..మృతితో తాడేపల్లి పోలీసులు కన్నీటిపర్యంతమయ్యారు. వృద్ధురాలి మృతి సమాచారం తెలుసుకుని గతంలో పనిచేసిన అధికారులు వచ్చి నివాళులు అర్పించారు. పాడె మోసి పోలీసులు, సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు.

old women
author img

By

Published : Sep 10, 2019, 2:12 PM IST

పోలీసుల అభిమానాన్ని పొందిన వృద్ధురాలు మృతి

పోలీసుల అభిమానాన్ని పొందిన బామ్మ ఇక లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 30 ఏళ్లుగా గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు సేవలందిస్తున్న వృద్ధురాలు ఇవాళ కన్నుమూసింది . 80 ఏళ్ల బానావత్‌ మూగమ్మకు మాటలు రావు అయినా పోలీస్ స్టేషన్లో మహిళా ఖైదీలకు కాపలాగా ఉండేది. మహిళా కానిస్టేబుళ్లు లేని సమయంలో మహిళా నిందితులను తనిఖీ చేయడంలో తనదైన పాత్ర పోషించేది. తన అనుకునే వారు ఎవరూ లేకపోవడంతో పోలీసులే ఆమెను పోషిస్తూ వచ్చారు.

సెంట్రీ లాగానే 24 గంటలపాటు స్టేషన్ పోలీసులకు పూర్తి సహకారాలు అందించేది. అలా సిబ్బందితోపాటు అధికారులకు ఆమెతో అనుబంధం ఏర్పడింది. మంగళవారం వేకువజామున మూగమ్మ కన్నుమూసింది. బామ్మ ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక తాడేపల్లి పోలీసులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్ఐ వినోద్ కుమార్ వృద్ధురాలి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . గతంలో పనిచేసిన పోలీసు అధికారులు సైతం ఆమె మృతి వార్త విని... తాడేపల్లికి వచ్చి నివాళులర్పించారు. సుగాలి సామాజికవర్గానికి చెందిన వృద్ధురాలు కావడంతో మండలంలోని ఆయా సామాజిక వర్గాలతోపాటు స్థానిక మహిళలంతా ఆమెను చివరి చూపు చూసుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఎస్సై వినోద్ కుమార్ సొంత ఖర్చులతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 30ఏళ్లుగా తమతోపాటే ఉన్న బామ్మ అంతిమ యాత్రలో పోలీసులు బాధాతప్త హృదయాలతో పాడె మోసి అభిమానాన్ని చాటుకున్నారు.

Intro:AP_cdp_47_10_ykapa di_kakshya sadhimpu_palana_Av_Ap100
k.veerachari, 9948047582
వందరోజుల పరిపాలనపై ధైర్యం ఉంటే రెఫరెండం తో ప్రజల్లోకి వెళ్లాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. కడప జిల్లా రాజంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనంతా కక్షపూరితంగా సాగుతోందని విమర్శించారు. వంద రోజుల పాలన లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిందొకటి, చేసిందోకటి, జరిగేది ఒకటిలా ఉందని ఎద్దేవా చేశారు. ఏదైనా ఒక పాలసీని అమల్లోకి తెచ్చేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అమలు చేయాలని సూచించారు. కానీ విధి విధానాలు సక్రమంగా లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇసుక విధానంలో సరైన నిర్ణయాలు తీసుకున్న కారణంగా రాష్ట్రంలో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని నిర్మాణాలు స్తంభించిపోయాయి తెలిపారు. మీకు కావాల్సిన వ్యక్తులపై కక్ష సాధింపు కోసం పోలవరం టెండర్లు పిలవడం సరికాదన్నారు. కేంద్రం ఒకపక్క చెబుతున్నా పెడచెవిన పెట్టి ముందుకు వెళ్లడం వల్ల భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం అంటే ఒక పార్టీ కో ఒక వర్గానికి కాదని, ప్రజలందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందన్నారు. దేవాదాయ శాఖకు చెందిన భూములను ఇతరులకు దారాదత్తం చేసే ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. వక్ఫ్ బోర్డ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన స్థలాల్లో ఒక సెంటు భూమిని తగిలే ధైర్యం నీకు ఉందాని ప్రశ్నించారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషిచేయాలని సూచించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు, పార్టీ అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Body:ధైర్యం ఉంటే వంద రోజుల పాలన పై రెఫరెండంతో ప్రజల్లోకి వెళ్లాలి

Conclusion:భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.