గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రీజినల్ డిప్యూటీ కమిషనర్ శాసింద్రన్తో పాటుగా తదితరులు స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ వెంకయ్య, ఎంఈవో నాగయ్య వారికి పలు విషయాలు వివరించారు. అనంతరం మాచర్లలోని జడ్పీ బాలుర హైస్కూల్లో తాత్కాలికంగా తరగతుల ఏర్పాటుకు అనుకూలమైన గదులను పరిశీలించారు. రెవెన్యూ వారు స్థలాన్ని అప్పగించిన అనంతరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని శాసింద్రన్ తెలిపారు. పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో దిల్లీలోని ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
![మాచర్లలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9534341_243_9534341_1605265171748.png)
ఇవీ చదవండి