ETV Bharat / state

ప్రభుత్వ ఆధీనంలోకి బ్రాహ్మణ కార్పొరేషన్​ భూమి - bhrahmana corporation land

బ్రాహ్మణ కార్పొరేషన్​కు గుంటూరులో ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అక్రమార్కుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దశాబ్దానికి పైగా అధికారులు చేస్తున్న పోరాటానికి శుభం కార్డు పడింది. దీనిపై బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

yadavalli dhramastram land
బ్రాహ్మణ కార్పోరేషన్​ భూమిని= స్వాధీనం
author img

By

Published : Jun 17, 2021, 6:43 PM IST

బ్రాహ్మణ కార్పోరేషన్​ భూమి స్వాధీనంపై హర్షం వ్యక్తం

గుంటూరులోని కొత్తపేటలో యడవల్లి ధర్మసత్రానికి చెందిన రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ స్థలం గతంలో దేవదాయశాఖ ఆధీనంలో ఉండేది. ఆ స్థలాన్ని ఒకరు లీజుకు తీసుకుని రెండు సినిమా థియేటర్లు నిర్మించారు. 2009లో లీజు గడువు ముగియడంతో అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకోగా.. థియేటర్లు అలాగే ఉండిపోయాయి. దీంతో ఆ స్థలాన్ని దేవదాయశాఖ లీజుకి ఇచ్చేందుకు వేలం నిర్వహించింది. నెలకు 2 లక్షల 35 వేల అద్దె చెల్లించేలా థియేటర్ల యజమాని అల్తాఫ్ దేవదాయశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మూడేళ్లకు ఓసారి అద్దె పెంచాలని నిబంధన విధించారు. అయితే 2012లో అద్దె పెంపు విషయంపై మళ్లీ వివాదం వచ్చింది. దీంతో ఇరుపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆ వివాదం ఇప్పటికీ న్యాయస్థానం పరిధిలోనే ఉంది.

యడవల్లి వారి ధర్మసత్రం ఆస్తులను.. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్​కు అప్పగిస్తూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత బ్రాహ్మణ కార్పోరేషన్ తరపున థియేటర్ల యజమానితో న్యాయపోరాటం కొనసాగింది. లీజు బకాయిలు కూడా 2కోట్ల రూపాయలకు పైగా పెండింగ్​లో ఉండిపోయాయి. ప్రస్తుతం యడవల్లి సత్రం బాధ్యతలు చూస్తున్న దేవదాయశాఖ ఈవో సుభద్ర.. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా చొరవ తీసుకున్నారు. దీంతో లీజుదారుడు అల్తాఫ్ దిగివచ్చి.. యడవల్లి వారి ధర్మసత్రానికి చెందిన స్థలాన్ని అధికారులకు అప్పగించారు. ప్రభుత్వంతో చర్చించి.. ఈ స్థలంలో ఏ అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలో నిర్ణయిస్తామని దేవాదాయశాఖ ఈవో సుభద్ర తెలిపారు.

అక్రమార్కుల నుంచి కాపాడండి..

వంద కోట్ల రూపాయల విలువైన స్థలం దేవదాయశాఖ పరిధిలోకి రావడంతో.. బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్థలాన్ని స్వాధీనం చేసుకోవటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన దేవదాయశాఖ ఈవో సుభద్రను అభినందించాయి. దేవదాయశాఖకు చెందిన చాలా ఆస్తులు ఇలా కబ్జాలకు గురయ్యాయి. అధికారులు చొరవ తీసుకుని అక్రమార్కుల నుంచి కాపాడితే కోట్లాది రూపాయల విలువైన భూములు తిరిగి దేవదాయశాఖ పరిధిలోకి వస్తాయని బ్రాహ్మణ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చదవండి:

AOB ALERT : ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో భారీగా పోలీసుల మోహరింపు

బావిలో పడిన ఏనుగు.. ఇలా బయటకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.