లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన తారలు ఇప్పుడిప్పుడే షూటింగ్లకు హాజరవుతున్నారు. లాక్డౌన్ సడలింపులతో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన జబర్దస్త్ ప్రేమ్ హర్షిత (షేక్గౌస్ బాష) స్థానికంగా ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని 'ఓ బావ' పేరుతో లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, చెరువుగట్టు, పరిసర ప్రాంతాల్లో రహదారులు, పొలాల మధ్య చిత్రీకరణ చేస్తున్నారు. బావా మరదళ్ల మధ్య సాగే సరదా సన్నివేశాలతో సాగే ఈ లఘు చిత్రంలో హర్షిత హీరోయిన్గా, శివ ఆంజనేయులు హీరోగా మరో నలుగురు సహచర నటులుగా నటిస్తున్నారు. ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్ ఛానల్లో త్వరలో రిలీజ్ చేయనున్నట్లు గౌస్ బాషా తెలిపారు.
ఇవీ చూడండి...: హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ