కొవిడ్ సమయంలో పిల్లలు - తల్లులు తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగహన కల్పిస్తూ.. మహిళాభివృద్ధి - శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన నిర్వహించారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఐసీడీఎస్ అధికారులు పరిశీలించారు. పోషకాహార జాగ్రత్తలకు సంబంధించిన బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు స్వీయ పరిరక్షణ పాటించాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు.
బాలింతలు, పిల్లలు చక్కని ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఈ ప్రదర్శనను మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చన్నారు.
ఇదీ చదవండి: ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని రైతుల ఆందోళన