NRIs Protest Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై దేశ, విదేశాల్లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుతో గత కొన్ని రోజులుగా ఎక్కడికక్కడ రోడ్లపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ.. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు.. తెలుగు ప్రజలు ఉన్న చోట ఆందోళనలు ఎగసిపడుతున్నాయి.
Protest Against Chandrababu Arrest: చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేంతవరకు ఉద్యమాన్ని విరమించేదే లేదంటున్నారు. టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా "బాబుతో నేను", ''వియ్ ఆర్ విత్ సీబీఎన్", "ప్రజల కోసం మీరు.. మీతోనే నేను" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు "ఆంధ్రప్రదేశ్లో సైకో పోవాలి.. సైకిల్ రావాలి" అంటూ నినాదాలతో కదంతొక్కుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీలో.. తెలుగు ప్రజలు "బాబుతో నేను" అనే నినాదంతో ఆందోళనలు చేపట్టారు.
Telugu People Protest on CBN Arrest: ప్రవాసాంధ్రులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి.. చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. "వియ్ ఆర్ విత్ సీబీఎన్" అంటూ చంద్రబాబుకు మద్దతుగా కదంతొక్కుతున్నారు. తమ విజనరీ లీడర్ అక్రమ అరెస్టును ఖండిస్తూ.. అమెరికాలోని మాంచెస్టర్లో ప్రవాసాంధ్రులు.. నల్లచొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హ్యూస్టన్ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగువారు మానవహారం నిర్వహించారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా ప్రవాసాంధ్రులు తప్పుబట్టారు.
NRIs Protest on CBN Arrest: ఈ క్రమంలో చంద్రబాబుకు మద్దతుగా, ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా అరిజోనాలో తెలుగు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. "వియ్ ఆర్ విత్ సీబీఎన్" నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. బోస్టన్‌లో ఎన్ఆర్ఐ.. టీడీపీ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. "ప్రజల కోసం మీరు.. మీతోనే నేను" అనే నినాదంతో చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు చేశారు. చంద్రబాబు విజనరీతో చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. మానవహారం నిర్వహించారు.
Chandrababu Followers Rally in LB Nagar : 'చంద్రబాబును విడుదల చేసేంత వరకు నిరసనలు కొనసాగుతాయి'
TDP Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో తెలుగు ప్రజలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. "ఐ యామ్ విత్ సీబీఎన్".. "వియ్ స్టాండ్ విత్ సీబీఎన్", "సేవ్ డెమోక్రసీ..సేవ్ ఆంధ్రప్రదేశ్" నినాదాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధుల్లో సుమారు 3 గంటలపాటు నిరసన ప్రదర్శన చేశారు. ప్రజలలో చంద్రబాబుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.