ETV Bharat / state

No Vote to Ex SEC Nimmagadda Ramesh kumar : ఓటు హక్కు కోసం.. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పోరాటం.. గత మూడేళ్ల నుంచి..

No Vote to Ex SEC Nimmagadda Ramesh kumar: వైసీపీ ప్రభుత్వ యంత్రాంగం తలచుకుంటే.. అన్ని అర్హతలు ఉన్నా సరే... ఓటు హక్కు కోసం వేచి ఉండాల్సిందే. సాక్షాత్తు 35 ఏళ్లకు పైగా ఏపీ కేడర్‌ ఐఏఎస్ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసి, ఆపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. తమకు గిట్టని, ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లు లక్షల్లో తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాలపై చర్యలు తీసుకొంటోంది. అదే నిమ్మగడ్డ విషయంలో మాత్రం.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసి మూడేళ్లుగా నిరీక్షించాల్సిన పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా ఇంకా ఆయన దరఖాస్తు పరిశీలనలోనే ఉండటం.. వైసీపీ ఏలుబడిలో ప్రభుత్వ యంత్రాంగం తీరకు అద్దం పడుతోంది.

No_Vote_to_Nimmagadda_Ramesh_kumar
No_Vote_to_Nimmagadda_Ramesh_kumar
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 8:51 AM IST

No Vote to Nimmagadda Ramesh kumar : మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓటు హక్కు కోసం పోరాటం

No Vote to Ex SEC Nimmagadda Ramesh kumar : నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌. తన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటరుగా చేరడానికి దాదాపు మూడేళ్లుగా ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన హైదరాబాద్‌లో ఉన్న తన ఓటును సరెండర్‌ చేసి, ఆ ధ్రువపత్రం జతచేసి మరీ స్వగ్రామంలో ఓటు హక్కు కోసం స్థానిక తహసీల్దార్‌కు 2020 చివర్లో దరఖాస్తు చేసుకున్నారు. దుగ్గిరాలలో ఆయనకు ఇల్లు, పొలం, ఆస్తులు ఉన్నాయి. రమేష్‌కుమార్‌ తల్లి అక్కడే నివసిస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఆయన ఎక్కడున్నా తరచూ గ్రామానికి వెళ్లొస్తుండేవారు.

Ex State Election Commissioner Nimmagadda Ramesh Application For Vote : 18 ఏళ్లు నిండిన ఏ భారతీయ పౌరుడైనా దేశంలో ఎక్కడో చోట ఓటు హక్కు కోరుకోవచ్చు. అందులో భాగంగానే ఆయన స్వగ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయన స్థానికంగా ఉండట్లేదంటూ తహసీల్దార్‌ దరఖాస్తు తిరస్కరించారు. రమేష్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఓటరుగా పేరు నమోదుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇటీవల ఆయన బీఎల్‌వోకు దరఖాస్తు సమర్పించారు. స్థానికంగా నివసిస్తున్నట్లు అన్నీ ఆధారాలు సమర్పించారు. తహసీల్దార్‌ ఫారం-12 కింద నోటీసు ఇచ్చి విచారణ కోసం పిలిపించారు.

Former SEC Nimmagadda Ramesh Applied for Vote మరోసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎన్నికల కమిషనర్

Nimmagadda Ramesh kumar Fight for His Vote Last Three Years : నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎస్‌ఈసీగా పనిచేసినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తాయి. ఇప్పటికీ ఆయనకు ఓటు హక్కు ఇవ్వడానికి ఈసీ ఆధీనంలోని అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. దుగ్గిరాల తన స్వగ్రామమని, స్థానికంగానే ఉంటున్నానని నిమ్మగడ్డ అన్ని ఆధారాలతో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాలతో తాజాగా దరఖాస్తు చేసుకున్నా, ఇంకా పరిశీలనలోనే ఉంది.

నిమ్మగడ్డ స్థానికంగా నివాసం ఉండట్లేదన్న కారణంతో ఆయన ఓటు హక్కును తిరస్కరిస్తున్న ఈసీ.. ముఖ్యమంత్రి జగన్‌కు ఏ ప్రాతిపదికన పులివెందులలో ఓటు హక్కు కొనసాగిస్తోంది? 2019 కంటే ముందంతా జగన్‌ బెంగళూరు, హైదరాబాద్‌ల్లోనే నివాసమున్నారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక గుంటూరు జిల్లా తాడేపల్లిలోనే నివసిస్తున్నారు. స్థానికంగా నివసించడమే ప్రాతిపదికయితే జగన్‌కు పులివెందులలో ఓటు ఎలా ఉంచారు? ఆయన ఓటు ఉండాల్సింది తాడేపల్లిలోనే కదా. ప్రభుత్వంతో విభేదాలు ఉంటే ఓ న్యాయం.. ప్రభుత్వ అధినేత అయితే మరో న్యాయం అన్నట్లు ఉంది రాష్ట్రంలో పరిస్థితి.

Kurnool Mayor Vote Missing: కర్నూలులో మేయర్ ఓటు గల్లంతు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి..?

మాజీ ఎస్‌ఈసీకి ఓటు హక్కు కల్పించేందుకు ఇన్ని కొర్రీలు వేస్తున్న ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో లక్షల నకిలీ ఓట్లు ఎలా చేర్చిందో చెప్పాలి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా ఎలా తొలగించేస్తోంది తెలపాలి. తమకు ఓటు వేయరనుకునే వారి పేర్లు ఓటరు జాబితాలో నుంచి తీసేయించడానికి వైసీపీ నాయకులు గంపగుత్తగా దరఖాస్తులు చేస్తుంటే వాటిపై క్షేత్రస్థాయి విచారణ లేకుండానే ఎలా తొలగిస్తుందో సమాధానం చెప్పాలి. ఉనికిలో లేని పేర్లు, డోర్‌ నంబర్లతో ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను ఎలా ఆమోదిస్తుందీ.

Fake Votes in AP : ఒకే వ్యక్తి పేరుతో రెండు, అంతకు మించి ఓట్లు ఎలా చేర్చింది. వంటివన్ని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వైసీపీ నాయకులు చేస్తున్న దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే చర్యలు తీసుకోవడం ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. సీఈసీ, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ పలు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, వాలంటీర్లు, వారి కుటుంబీకుల పేరిట రెండు, మూడేసి ఓట్లు ఉండటంపై మీడియాలో సాక్ష్యాలతో సహా కథనాలు వస్తున్నా ఎన్నికల సంఘం స్పందించట్లేదు.

ఉరవకొండ, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గాల్లో వేల ఓట్ల తొలగించగా, నర్సీపట్నంలో వైసీపీ నాయకులు, వాలంటీర్ల కుటుంబ సభ్యుల పేరిట రెండు, అంతకంటే ఎక్కువ ఓట్లు చేర్చారు. ఈ చేర్పులు, తొలగింపులు ఏ నిబంధనల మేరకు చేశారు, అసలు వైసీపీ శ్రేణుల గంపగుత్త దరఖాస్తులను ఎలా ఆమోదిస్తున్నారో అధికారులు జవాబు చెప్పాల్సి ఉంది.

Fake Votes in AP: ముందుకు సాగని ఓటర్ల జాబితా సవరణ సర్వే.. బీఎల్వోల ముందు సమస్యల చిట్టా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.