కరోనా కారణంగా వేరే జబ్బులతో బాధపడుతున్న వారికి చికిత్స అందడంలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన బాలాజీ నాయక్‌కు తరచుగా జ్వరం వస్తుండటంతో కరోనా పరీక్షలు చేయించారు. అందులో నెగెటివ్ వచ్చింది. దీంతో గుంటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపిస్తే అతనికి మూత్రపిండాల సమస్య ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక బాలాజీ నాయక్‌ను అతని భార్య నాగ మల్లేశ్వరి.. గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. అయితే కొవిడ్ రోగులు ఎక్కువగా ఉన్నందున వేరే వాళ్లను చేర్చుకోవడం లేదని అక్కడి సిబ్బంది తెలిపారు. అక్కడి నుంచి జ్వరాల ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా ఇలాంటి సమాధానమే వచ్చింది. ఇదిలా ఉండగా బాలాజీ నాయక్ అక్కడ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యులు మందులు ఇచ్చి పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స నిరాకరించటంపై నాగమల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తప్ప వేరే రోగాలకు వైద్యం చేయకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి..