గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఖాతాదారులు... భౌతిక దూరం పాటించకుండా క్యూలైన్లో నిలబడ్డారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధదారులు, ఖాతాదారులతో బ్యాంకు ఆవరణ మెుత్తం కిక్కిరిసిపోయింది. సత్తెనపల్లిలో ఇప్పటికే 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా.. ప్రజల్లో మాత్రం భయం కానరావటం లేదు. భౌతిక దూరం పాటించకుంటే కొవిడ్ మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సీఎం అబాసుపాలు: చినరాజప్ప