ETV Bharat / state

పల్నాడులో శీతల గోదాములు లేక రైతుల అవస్థలు

పంటలు పండించడంలో నిపుణులు గుంటూరు జిల్లాలోని పల్నాడు రైతులు. దిగుబడులు బాగున్నా మార్కెట్టు యార్డుల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటను నష్టపోవడం ఇష్టం లేక వచ్చినకాడికి చాలని సరిపెడుతున్నారు.

no cold storages in palnadu..farmers suffering
పల్నాడులో శీతల గోదాములు లేక రైతుల అవస్థలు
author img

By

Published : Oct 23, 2020, 4:56 PM IST

జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి 80 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది పల్నాడు. పంటలు పండించడంలో నైపుణ్యం ఉన్న రైతులు పల్నాడులో ఎక్కువగానే ఉన్నారు. దిగుబడులు బాగున్నా మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటను నష్టపోవడం ఇష్టం లేక వచ్చినకాడికి చాలని సరిపెడుతున్నారు. ప్రస్తుతంమిర్చి సాగుకు పల్నాడే కీలకం. ఇక్కడ పండించే పంటకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉంది. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల పరిధిలో పంట దాచుకునేందుకు మార్కెట్‌ యార్డుల్లో శీతల గోదాములు అందుబాటులో తెస్తామని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెబుతున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికైనా మార్కెట్‌ యార్డుల్లో వసతులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

గిట్టుబాటు ధర లేకున్నా విక్రయిస్తూ...

మిర్చికి గిట్టుబాటు ధరలు లేకపోయినా నిల్వచేసుకునే అవకాశం లేక రైతులు విక్రయిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ప్రతి ఏటా లక్ష హెక్టార్లకు పైగా సాగు చేస్తున్నారు. వచ్చే దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్దనే విక్రయిస్తున్నారు. మరింత ధర కోసం రైతులు గుంటూరు మిర్చియార్డుకు వెళుతున్నారు.ధరలు ఆశాజనకంగా లేని సమయంలో పల్నాడుతో పాటు, గుంటూరు పరిధిలోని ప్రైవేట్‌ శీతల గోదాములు(కోల్డ్‌స్టోరేజి)ల్లో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పులు చేసి సాగు చేసిన పంటకు..ఈ అదనపు ఖర్చులు రైతులకు భారంగా మారాయి. మాచర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, దుర్గి పరిధిలో శీతల గోదాములు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. కూరగాయలు, పండ్ల సాగు గతంలో కంటే గణనీయంగా పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పంటను తీసుకొచ్చినా, నిల్వ చేసుకునే అవకాశం లేదు.

మంత్రి దృష్టి సారిస్తేనే..

పల్నాడు అంటేనే వెనుకబడిన ప్రాంతం. వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారే అధికం. రైతులు పండిస్తున్న పంటలను నిల్వ చేసుకోవడంతో పాటు, గిట్టుబాటు ధరలు లభించాలంటే మార్కెట్‌ యార్డుల్లో వసతులు సమకూర్చాలి. పత్తి, మిర్చి, ధాన్యం, కందులు ప్రస్తుతం యార్డుల ద్వారా విక్రయిస్తున్నారు. శీతల గోదాములు ఉండటంతో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి: గుంటూరు జిల్లాలో వర్షాలకు మునిగిపోయిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.