ETV Bharat / state

'పెళ్లి కూతురు'లా పరిచయం - బుల్లెట్‌ బండెక్కి షికారు వెళ్లాక బయటపడింది!

మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరిట మోసాలు - కుప్పలు తెప్పలుగా బాధితులు

Matrimony Frauds in Hyderabad
Matrimony Frauds in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 7:24 AM IST

Matrimony Frauds in Hyderabad : పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలనేది ఒకప్పటి మాట. నేడు టెక్నాలజీ పుణ్యమా అని ఆన్​లైన్​లోనే సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. తాజాగా ఓ మాయలేడి నకిలీ వివరాలతో ప్రొఫైల్ ఏర్పాటు చేసింది. తనను సంప్రదించిన వారిని మాటల్లోకి దింపి వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటోంది. ఈ ఘటన హైదరాబాద్​లో వెలుగులోకి వచ్చింది.

ఆ మహిళ వయసు 35-40 మధ్య ఉంటుంది. వివిధ కారణాలతో భార్య దూరమై జీవితభాగస్వామి కోసం వెదికే పురుషులకు గాలం వేస్తోంది. వారికి దగ్గరై అందినంత దోచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో ఈ కిలేడీ బారినపడి ఎంతో మంది మోసపోయినట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఒకరిద్దరు బాధితులు తమ బాధను పంచుకున్నా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని ఆయన తెలిపారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుడు దగ్గరై బహుమతి కోరినా ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆచితూచి స్పందించాలని సూచించారు. మాయలేడి వలపు వలతో ఎలా చిత్తు చేస్తుందనేది తెలుసుకోండి.

చెప్పాలంటే సిగ్గుచేటండీ ఇదీ 55 సంవత్సరాల వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట. బాపట్ల జిల్లాకు చెందిన మధ్య వయస్కుడు. మంచి ఉద్యోగం సమాజంలో గౌరవం అన్నీ ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య కారణంగా మనోవేదన అనుభవిస్తున్నాడు. భార్య సూచనతో మ్యాట్రిమోనీ సైట్‌లో రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలోనే మహిళల వివరాలు పరిశీలించాడు. వారిలో హైదరాబాద్​కి చెందిన ఒక మహిళ పరిచయమైంది.

ఇద్దరి మధ్య ఫోన్‌ నంబర్ల మార్పిడి జరిగాక కొద్దిరోజులు ఛాటింగ్‌, సంభాషణలతో కాలం గడిపారు. ఇటీవల తనను కలిసేందుకు హైదరాబాద్‌ రమ్మంటూ ఆమె కోరింది. దీంతో ఆయన బుల్లెట్‌ బండెక్కి ఇక్కడకు చేరాడు. ఆమె ఇచ్చిన చిరునామా ప్రకారం నగర శివారు షాపింగ్‌ మాల్‌కు వెళ్లాడు. ఆమె సౌందర్యం మాటతీరు నచ్చటంతో అతడు తెగ ఖుషీ అయ్యాడు. ఈ బలహీనత గమనించిన ఆమె అతడి డెబిట్‌ కార్డుతో రూ.40,000 షాపింగ్‌ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ బాధితులు : అనంతరం బయటకు వచ్చి ఇద్దరూ ఓ హోటల్‌లో భోజనం చేశారు. వారు మాట్లాడుకుంటుండగా పోలీసు కానిస్టేబుల్‌ వారి సమీపంలోకి వచ్చాడు. భయపడినట్టు నటించిన ఆ మహిళ మరోసారి కలుద్దామంటూ వెళ్లిపోయింది. ఒకరికొకరు నచ్చామనే అభిప్రాయంతో అతడు సొంతూరు చేరాడు. తర్వాత ఫోన్‌ చేస్తే అమ్మమ్మ చనిపోయిందని మూడు నెలల వరకూ పెళ్లి తంతు జరగకూడదంటూ చెప్పి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసింది. దీంతో మోసపోయానని గ్రహించాడు. విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి వధూవరుల వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలుకు రూ.2.5లక్షలు కాజేసింది. సికింద్రాబాద్‌లో విశ్రాంత ఆర్మీ అధికారికి మ్యాట్రిమోనీలో పరిచయమైన ఒక మహిళ రూ.5 లక్షల వరకూ ఖర్చుచేయించింది.

మాయలేడీ లీలలు.. రూ.లక్షలు కోల్పోయిన బాధితులు

8 మందిని పెళ్లాడిన 'కిలేడీ'- రెండు రాష్ట్రాల పురుషులకు టోపీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.