ETV Bharat / state

తుపాన్​ ఎఫెక్ట్​.. 70 వేల ఎకరాల్లో నీట మునిగిన పంట - nivar cyclone effect at suryalanka latest news update

గుంటూరు జిల్లాలో నివర్ తుపాన్​ ప్రభావం కొనసాగుతోంది. తుపాన్ కారణంగా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో వైమానిక విన్యాసాలు రద్దు చేశారు. అలల ధాటికి తమ పడవలు కొట్టుకుపోకుండా మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాపట్ల ప్రాంతంలో 70 వేల ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. తుపాను తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

nivar cyclone effect
గుంటూరు జిల్లాలో నివర్ ప్రభావం
author img

By

Published : Nov 26, 2020, 5:09 PM IST

నివర్ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షం కురుస్తోంది. నివర్ కారణంగా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో వైమానిక విన్యాసాలు రద్దు చేశారు. తుపాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి జోరుగా కురుస్తున్న వర్షానికి చలిగాలులు తోడుకావటం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యలంక సముద్రం తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటం.. 10 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. నిజాంపట్నం హార్బర్​ లో మూడో నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు. బాపట్ల ప్రాంతంలో 70 వేల ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. తుపాను తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలల ధాటికి తమ పడవలు కొట్టుకుపోకుండా మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి...

గుంటూరు జిల్లాలో చిరుజల్లులు.. ఈదురుగాలులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.