రాష్ట్రంలో దోమల నివారణ కోసం పురపాలక శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమవుతోంది. సెన్సార్లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా దోమల సంఖ్యను, జాతిని నిర్ధారించి... అందుకు అనుగుణంగా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పురపాలకశాఖ సంచాలకులు కన్నబాబు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేస్తున్నామన్న కన్నబాబు... నివేదికను బట్టి రాష్ట్రంలోని మిగతా పురపాలికల్లో అమలు చేస్తామని చెప్పారు. అమెరికా సంస్థతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కన్నబాబు వివరించారు.
ఇదీ చదవండి...