నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి దశలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. కొత్త ట్రాక్‌ను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అనంతరం న్యూ పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు రైలు నడిపారు. రేపు రొంపిచర్ల నుంచి శావల్యాపురం వరకు నడపనున్నారు. పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 600 కోట్ల వ్యయంతో 45.85 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ను నిర్మించినట్లు దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ మేనేజర్ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : పిడుగురాళ్లలో రోడ్డుపక్క దుకాణాలు మూసివేత